సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత
కాజులూరు, మేజర్ న్యూస్ :
మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఏఆర్ డీఎస్పీ (AR DSP) శ్రీహరి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు విధులలో ముగ్గురు సీఐలు, పదిమంది ఎస్సైలతో పాటు 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా, అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన కాజులూరు, పల్లెపాలెం గ్రామాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. అదేవిధంగా సమస్యాత్మక గ్రామాలైన కోలంక, , సలపాక, మంజూరు మంజేరు, శీల గ్రామాలలో అదనపు సిబ్బందిని కేటాయించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.