BREAKING
నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం

ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి

Select Suryaa Now
ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ;జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలని, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు జే. అరుణశ్రీ, బి. శ్రీరాములుతో కలిసి వివిధ పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సమయానికి విధులకు హాజరుకావాలని, ఉద్యోగుల హాజరును అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి ‘మీ ప్రమాణం’ యాప్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల హాజరును ఈ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.జిల్లా అధికారులు తమ పర్యటనలకు సంబంధించిన టూర్ డైరీలను ప్రతి నెలా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదులు, ఇతర పెండింగ్ ఫైళ్లను నిరంతరం సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ అంశాల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయం, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యాలయ భవనాలు, పరిసరాల పరిశుభ్రతను కాపాడటం సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. కార్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా నిరంతరం చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిపాలనాపరమైన అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో అందరూ జిల్లా అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.