పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్..
వినాయక గంజి ప్రాంతంలో నిర్లక్ష్యం, ప్రజల విమర్శలు…
ఫరూక్ నగర్ రంగారెడ్డి
:షాద్ నగర్ పట్టణంలోని వినాయక గంజి ప్రాంతంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన ఐమాక్స్ వీధి దీపాలు పట్టపగలు కూడా వెలుగుతూ ఉండడంతో విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు సైతం దీపాలు ఆరిపోకుండా వెలుగుతుండటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని, పొదుపు చేయాలని చెబుతుంటే, మరోవైపు ఇలా పగటిపూట లైట్లు వెలగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తరచుగా ఈ దీపాలు సూర్యోదయం తర్వాత కూడా వెలుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో అవసరమైన చోట లైట్లు వెలగకపోవడం, పగటిపూట విద్యుత్ దుర్వినియోగం జరుగుతోందని విమర్శిస్తున్నారు. పగటిపూట వీధిలైట్లు వెలక్కుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ వినియోగాన్ని వృధా కానీయకుండా జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.