ప్రకృతి వ్యవసాయంతో భూసార పరిరక్షణ
బాడంగి, సూర్య : ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు సేంద్రియ ద్రావణాల తయారీపై అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ఎంటీ వై. సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం బాడంగిలో అగ్ని అస్త్రం, గొల్లాది గ్రామంలో సప్తధాన్య కషాయ ద్రావణాన్ని రైతుల సమక్షంలో తయారు చేశారు. అగ్ని అస్త్రం పంటలను ఆశించే వివిధ రకాల పురుగుల నివారణకు, సప్తధాన్య కషాయ ద్రావణం నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి, పంటల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడతాయని సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్‌పీలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.