BREAKING
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ రాయికోడ్ జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం దీపావళి కానుకగా 'మూకుతి అమ్మన్ 2' విడుదల.. చెన్నై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నటి నయనతార! పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం ఖజానా ఖాళీ.. పంచాయతీల్లో పాలన కుదేలు! అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ కృష్ణ ప్రత్యేక చొరవ అవోపా శాశ్వత నిధి కింద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ చొరవతో గ్రామస్తులకు ఊరట బీఎస్పీ సీనియర్ నాయకుడు నర్సింలు మృతి మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ * ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎంపీపీ రేసులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గాత్రం సౌమ్యశ్రీ బరువు తగ్గేందుకు మందులు వాడానంటూ వస్తున్న వదంతులపై స్పందించిన నటి అమృత అరోరా.. అసలు విషయం బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ!

సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే

Select Suryaa Now
సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే

మనుబోలులో,  మేజర్ న్యూస్  :     సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే.  ప్రజల మద్దతుతో భారీ విజయాలు సాధించబోతున్నాం. డేగపూడి – బండేపల్లి కాలువ పనులను అడ్డుకున్న కాకాణికి మనుబోలు మండల ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు.  మనుబోలులో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.  జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్, మనుబోలు -1 అభ్యర్థి సాని భారతికి సైకిల్, మనుబోలు -2 అభ్యర్థి ఉదయ్ కి గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరిన సోమిరెడ్డి

ఉన్నత విద్యావంతుడైన పొట్టేళ్ల ప్రసాద్ దళితులకు జరిగిన అన్యాయాలపై తీవ్ర స్థాయిలో పోరాడారు..వైసీపీ అధికారంలో ఉండగా చేసిన అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.  వీరంపల్లిలో ఓ పెద్దరెడ్డి దళితులపై అరాచకం చేసి ఊరి నుంచి తరిమేశాడు...వారికి న్యాయం చేసేందుకు ప్రసాద్ అలుపెరగకుండా పోరాడారు.  గిరిజన బిడ్డను షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు నుంచి తొలగించి, ఆ ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్మేసుకున్న వైసీపీ నేత దుర్మార్గంపైనా పోరాడి విజయం సాధించిన నేపథ్యం ప్రసాద్ కు ఉంది.  ప్రజా సమస్యల పరిష్కారంపై సంపూర్ణ అవగాహన ఉన్న ప్రసాద్ ను జెడ్పీటీసీగా, ఎంపీటీసీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.  నేను నిధులు తెచ్చి పనులు ప్రారంభించిన డేగపూడి -బండేపల్లి కాలువ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నాడో మనుబోలు మండల రైతులకు కాకాణి సమాధానం చెప్పాలి.  కొమ్మలపూడిలో జాతీయ రహదారి పక్కనే విలువైన భూమిని తన బినామీల పేర్లతో రాసుకున్న చరిత్ర కాకాణిది.  వీరంపల్లిలో హైస్కూలు స్థలాన్ని కబ్జా చేసుకున్న వారిని నేనైతే చెక్కతో కొట్టివుండేవాడిని.  దళితులను ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలను కాకాణి హయాంలోనే చూశాం.  వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు.  ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మా అభ్యర్థులను గెలిపించి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందాం.  భూదోపిడీలు, అక్రమ మైనింగ్, నకిలీ డాక్యుమెంట్లు, కోర్టులో దొంగతనం వంటి నీచచరిత్ర కలిగిన కాకాణికి మరోసారి ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం.  ప్రజామోదంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీలు, ఐదు ఎంపీపీలను గెలిపించుకోబోతున్నాం