రాయికోడ్ జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
రాయికోడ్, ; మండల కేంద్రమైన రాయికోడ్ లోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం మంగళవారం నాడు నిర్వహించారు.ఈయొక్క సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల, బోధనా పద్ధతులు, పి ఎల్ ఎన్ అమలు, విద్యార్థుల అభ్యసన స్థాయిలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ యొక్క సమావేశంలో ఎంఈఓ నర్సిములు, రాయికోడ్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ నగేష్, పంపాడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంగీత,రాయికోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆర్పీలు తులసి, మల్లేశం, వీరమని, రాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలలకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు పొందారు.