సూర్య,లింగంపేట్-ఎలినినో ప్రభావం ఉన్నందున రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకొని జాగ్రత్త పడాలని జిల్లా వ్యవసాయం అధికారి మోహన్ రెడ్డి రైతులకు సూచించారు.అయన మంగళవారం లింగంపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో జీవ వనరుల కేంద్రం ప్రసరాం చేసిన రైతు నేస్తం కార్యక్రమం వీక్షించారు.ఈ ప్రసరాంలో ఎలినినో ప్రభావం అధిగామించెందుకు రైతులు యాసంగిలో చిరుధాన్యాల సాగు,యుపిఐ వినియోగం,పురుగుమందుల సురక్షిత వినియోగం,మామిడి తోటల నిర్వహణ,ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని పర్మల్లా, లింగంపేట్,ముంబాజీపేట రైతు వేదికల నుండి రైతులు వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి,మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్,ఏఈఓలు రాజ్యలక్ష్మి,సంతోష్,అమీర్,నవ్య, సతీష్,రైతులు పాల్గొన్నారు.