BREAKING
తుఫాన్ బీభత్సం.. కుప్పకూలిన రిటైనింగ్ వాల్! మూడు ఇళ్లకు నష్టం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్షం అడ్డొచ్చినా.. ప్రచారంలో వెనకడుగు లేదు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గిరిజాల బాబు దంపతుల పాదయాత్ర పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రెబల్ అభ్యర్థి వేముల శారదా ను గెలిపించండి. ఎమ్మెల్యే. జిల్లా సాయికి 40 మంది ఎంపిక పండుటాకులు కథ వృద్ధాప్యంలోనూ వసంతం రష్మిక మందన్నను వైల్డ్ అంటూ విజయ్ దేవరకొండ ప్రశంసలు: గాయాలపాలైనా కష్టపడిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షపు నీటిలో మునిగిన హైస్కూల్.. రంగంలోకి దిగిన ఎంపిడిఓ.. మమత కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే బండారు షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి అనిరుధ్ తప్పుకోవడం అప్పుడే జరిగిందా.. ఎడ్ షీరన్ పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన అసలు నిజం! ముమ్మిడివరం నగర పంచాయతీలొ కూటమి జోరు.. 23వార్డుల విజేతలు వీరే.. దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త *నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా? ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా యాదగిరిగుట్టలో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ భాస్కర్ 105 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.

నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం..

Select Suryaa Now
నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు! – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం..

రoగా రెడ్డి–;; రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నలుగురు అరెస్ట్-పరారీలో మరో ముగ్గురు 
ముంబాయి, గుజరాత్ నుండి ముద్రణ సామాగ్రి కొనుగోలు
షోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల వీక్షణతో నోట్ల తయారీకి శ్రీకారం
ఆన్ లైన్ లో నోట్ల పేపర్ కు ఆర్డర్
– కుంట్లూరులో గుట్టుచప్పుడుగా నకిలీ నోట్ల తయారీ కేంద్రం
– రూ.500 నోట్లను ముద్రించి చలామణి చేసేందుకు ప్రణాళిక
– పోలీసులమంటూ నకిలీ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్‌తో బెదిరింపులు

 

 

 


– వివరాలు వెల్లడించిన ఫ్యూచర్​ సిటీ సీపీ డాక్టర్ తరుణ్​ జోషి
అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్ (నవంబర్ 3) : కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నకిలీ కరెన్సీ ముద్రణకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఫ్యూచర్ సిటీ పోలీసులు భగ్నం చేశారు. నలుగురు నింధితులను అరస్టు చేయగా మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి వద్ద నుంచి రూ. 6.78 కోట్ల రూ. 500 నకీలి కరెన్సీతో పాటు స్కానర్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్లు తదితర ముద్రణ సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ పరిధిలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను కమీషనర్ తరుణ్ జోషి, మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజుతో కలిసి మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సోమవారం రాత్రి కుంట్లూరు నుంచి విజయవాడకు నకిలీ కరెన్సీ తరలిస్తున్నారని పక్క సమాచారంతో అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు, మహేశ్వరం, షాద్​నగర్​ ఎస్ఓటీ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి రామోజీ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్​ గెట్​  ఎదురుగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మారుతి డిజైర్ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, కారులోని బ్యాగులో నకిలీ రూ.500 నోట్ల కట్టలు రూ.8 లక్షలు బయటపడ్డాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిధితులు తెలిపిన వివరాల ఆధారంగా కుంట్లూరులోని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రం పై దాడి చేశారు. నిధితులు గత నెల రోజుల క్రితమే కుంట్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. షోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల చూసి నకిలీ కరెన్సీ తయారీకి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడువుగా ముంబాయి, గుజరాత్ నుంచి ముద్రణ సామాగ్రిని కొనుగోలు చేశారు. ఆన్ లైన్ లో నోట్ల తయారీ పేపర్ కు ఆర్డర్ చేశారు. అంత సమకూరాక నోట్ల తయారీకి పూనుకున్నారు. అసలు రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ ద్వారా వాటి చిత్రాలను మార్పులు చేసి కలర్ ప్రింటర్ల సహాయంతో నకిలీ నోట్లను ముద్రించారు. ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని   ప్రధాన నిందితుడు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా నేర్చుకున్నాడు. ముద్రించిన నోట్లను లామినేషన్ చేసి, కత్తిరించి మార్కెట్లో చలామణి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
*పోలీసులమంటూ వసూళ్లకు పాల్పడిన ముఠా*
నకిలీ కరెన్సీ తయారీ ప్రయత్నాల్లో విఫలమైన సమయంలో నిందితులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలతో పోలీసులుగా నటిస్తూ కాబోయే కొనుగోలుదారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున వసూలు చేశారు. ఒరిజినల్​ రూ.500 తీసుకుని వాళ్లకు నకిలీ రూ.2000 చొప్పులన ఇచ్చి మార్చుకునేవారు. 
నిందితులు తెలిపిన వివరాలతో కుంట్లూరులోని అద్దె ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించి అక్కడ రూ.6.70 కోట్ల విలువైన 134 కట్టల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో లభించిన నోట్లతో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. అంతేకాకుండా నింధితుల నుంచి కలర్ ప్రింటర్లు, లేజర్ ప్రింటర్, ల్యాప్‌టాప్, కరెన్సీ కటింగ్ మెషిన్, లామినేషన్ యంత్రం, కరెన్సీ లెక్కింపు, బైండింగ్ యంత్రాలు, ఇంక్ బాటిళ్లు, కాగితపు రోలర్లు, నకిలీ పోలీసు ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలు, నాలుగు సెల్‌ఫోన్లు, మారుతి డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఏడుగురిలో నలుగురు అరెస్ట్*
ఈ కేసులో ఏ1 ఇబ్రహీంపట్నం మండలం, ఉప్పరిగూడెం మడుపోజు కర్ణాకర్, ఏ2 కుకట్​ పల్లి, వివేకానంద నగర్  చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, ఏ3 జగిత్యాల జిల్లా, ధర్మపూరి మండలం, కుసునూర్​ పల్లి చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లా, యెనుగొండకు చెందిన కరణం అజయ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్​మెట్ మండలం, పెద్ద అంబర్​పేట్ చెందిన  జెల్లి వెంకటేష్, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా, జూలురుపాడు మండలం సురారం గ్రామానికి చెందిన కుంజా బాలరాజు,  భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా, జూలురుపాడు మండలం సురారం గ్రామానికి చెందిన కంపాసటి శ్రీనివాస్ పరారీలో ఉన్నారు. నకిలీ కరెన్సీ తయారీ, పంపిణీ వెనుక పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పట్టుకుంటామని సీపీ తెలిపారు. ఈ కేసును చేధించిన ఎస్​వోటీ పోలీసులు సీపీ రివార్డులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, షాద్‌నగర్ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ భూపాల్, శ్రీధర్, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రాజు తదితరులున్నారు.