BREAKING
అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు గుంటూరు ఎన్డీయే కూటమి ప్రభంజనం పొంగల్ బరిలో విజి సిద్దు డాయంగరం: యూట్యూబర్ దర్శకత్వంలో విడుదలైన ఆకట్టుకునే టీజర్ వర్షం కురిసినా.. వాతావరణం లో ...... ప్రజల రక్షణే మా బాధ్యత.. వర్షంలోనూ రహదారులపై విధులు నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపడుతున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.... చెవిరెడ్డి మోహిత్ రెడ్డి న్యాయపోరాటానికి ఫలితం..! -ఆ ఆరు మండలాల్లో 5న జరిగే పోలింగ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు -సీసీ కెమెరాల నిఘాలోనే ఎన్నికలు.. ప్రతి క్షణం రికార్డింగ్‌ చేయాల్సిందే అంచం పాతిర కాంబినేషన్ రిపీట్: కుంచాക്കോ బోబన్ కొత్త సినిమా ప్రకటన నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పుట్ట రాములు బొల్లేపల్లి ఉపాధ్యాయుడికి బాధ్యతలు ఏకగ్రీవ ఎన్నిక సీపీఎస్‌ఈ ఆస్తుల విక్రయంతో రూ.15,000 కోట్లు! త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’ దేశీయ మార్కెట్లో పెరిగిన ఉక్కు ధరలు ముక్కా శ్రావణి అఖండ విజయంపై కాపు సేన హర్షాతిరేకాలు పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి డిస్కో శాంతి: బుల్లెట్ మూవీతో అరంగేట్రం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి

Select Suryaa Now
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి

అర్హులైన పేదలకు అన్యాయం చేస్తే ఉపేక్షించం                *మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:                     డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉక్కు సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో నల్లమోతు భాస్కర్ రావు నేతృత్వంలో రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతు న్నారని, వీటి పంపిణీకి ముహూర్తం సైతం ఖరారు చేశారని ఆరోపించారు. లబ్ధిదారుల వివరాలు, లబ్ధిదారులను ఎంపిక చేసిన విధానం గురించి పూర్తి వివరాలను, జాబితాను విడుదల చేయలేదన్నారు.బీఆర్ఎస్‌కు ఉన్న క్రెడిట్‌ను తామే కొట్టేయాలని, డబుల్ బెడ్ రూమ్‌లను పంపిణీ చేసి ప్రజల్లో కొంత ఇమేజ్ దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతల ముందస్తు చూపు కొరవడటంతో తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల కరువు కష్టాలను దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ కపట ఎత్తుగడలు వేస్తోందని అన్నారు.
ఈనెల 6వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం ఉందని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని బడుగుల లింగయ్య యాదవ్, భాస్కర్ రావు డిమాండ్ చేశారు.మంగళవారం రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అర్హులైన పేదలను పక్కనపెట్టి అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన పూర్తి జాబితాను బహిరంగంగా ప్రకటించాలని, ఎంపికలో అనుసరించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సొంత ఇండ్లు కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హులుగా ఉన్నవారు జాబితాలో ఉంటే వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రలోభాలకు గురి కాకుండా అర్హత కలిగిన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కేలా చూడాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇలియాస్ ఖాన్, మగ్దుం పాషా, బంటు శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, సందేశి అంజన్ రాజు, మాజీద్, తిరుమలగిరి వజ్రం, దైద సత్యం, గంగుల బిక్షం యాదవ్, జన్నపాల కిరణ్, దీపిక విజయ్, అరుణ్, అలీం, బంటు దుర్గయ్య, పందిరి వేణు, వల్లపట్ల వినోద్, ఖలీల్, ఎక్క మనిదీప్, బిక్కన్ తదితరులు పాల్గొన్నారు.