ఆర్థిక సహాయం
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్,
స్టేషన్ ఘనపూర్ పట్టణానికి చెందిన కుంభం రాజయ్య ముదిరాజ్ ఇటీవల రెండు కిడ్నీలు పనిచేయక పోవడంతో అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. కడు పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబ పరిస్థితిని స్థానిక కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య, పీఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెసరు రాజన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన ముదిరాజ్ దాతలు, పీఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకుడు సింగారపు రామకృష్ణ, పెసరు సారయ్య
మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సింగారపు రామకృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వేరైనా, ఆపద సమయంలో కుల బంధువులంతా ఒక్కటై బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. స్టేషన్ ఘనపూర్ ముదిరాజుల ఐక్యత, మానవత్వానికి ఈ సహాయ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ముదిరాజ్ కుల పెద్దలు ఇలాంటి ఐక్యతను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు, తమ స్థాయికి తగిన విధంగా పేదలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
స్థానిక కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య మాట్లాడుతూ సిద్దిపేటలో ఉన్న పీఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెసరు రాజన్నకు కుంభం రాజయ్య కుటుంబ పరిస్థితిని వివరించగా వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు. ఈ సహాయానికి సహకరించిన పెసరు రాజన్నతో పాటు దాతలందరికీ గ్రామ ముదిరాజ్ కులస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలితజేశారు.కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ ముదిరాజ్, స్థానిక కౌన్సిలర్లు పొన్నం స్వరూప రాజయ్య, ముదిరాజ్, సేవకులు దండు చిరంజీవి ముదిరాజ్, సాంబరాజు, రాము, కుమారస్వామి, రవి, రాము, సుధాకర్, కుంభం మధు, కుంభం రామస్వామి శంకర్, వై.రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; మోహన్ ,స్టేషన్ ఘన్పూర్, జనగామ జిల్లా