BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

ఎస్.రాయవరం మండలంలో హోరెత్తిన కూటమి ర్యాలీ!

Select Suryaa Now
ఎస్.రాయవరం మండలంలో హోరెత్తిన కూటమి ర్యాలీ!

 

అభివృద్ధికే మీ ఓటు వేయండని కోరిన ఎంపీపీ అభ్యర్థి నల్లపరాజు వెంకటరాజు

ఎస్.రాయవరం, నవంబర్ 3, మేజర్ న్యూస్:
మండల పరిషత్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఎస్.రాయవరం మండలంలో మంగళవారం ఎన్నికల హడావిడి నెలకొంది. కూటమి తరపున ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని గుడివాడ గ్రామం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెద ఉప్పలం మీదుగా సాగింది. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన మండల స్థాయి నాయకులు, గ్రామాల కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అభ్యర్థి నల్లపరాజు వెంకటరాజు మాట్లాడుతూ, గతంలో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసిందని, మరోసారి కూటమి అభ్యర్థులకు అవకాశం ఇస్తే మండలంలో పెండింగ్ లో ఉన్న పనులతో పాటు మరింత అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఆలోచించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎం.పీ.పీ అభ్యర్థి వెంకటరాజు కోరారు. ఈ ర్యాలీలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.