BREAKING
బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు

Select Suryaa Now
జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి  టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు

                          
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : సీనియర్ జర్నలిస్టు భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర టియుడబ్ల్యూజే (ఐజేయు) కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం శేఖర్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి, టీయూడబ్ల్యూజే నేతలు స్వగ్రామం వెలమకన్నే కు వెళ్ళి భౌతిక కాయాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. శేఖర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, భవిష్యత్తులో శేఖర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రెస్ అకాడమీ తరపున తగిన సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం శేఖర్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

 శేఖర్ ప్రజాశక్తి, సూర్య తదితర పత్రికలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సురాబాద్ విలేకరిగా సేవలందించారు. ఆదివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పాత్రికేయ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెలమకన్నే గ్రామము శేఖర్ స్వస్థలం. ఈ సందర్భంగా కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. శేఖర్ మృతి జర్నలిస్ట్ రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. శేఖర్ కుటుంబానికి టీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ నుంచి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందేలా శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నివాళులర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జే.కిషన్ (రాధా కిషన్), జిల్లా సంయుక్త కార్యదర్శి బోల్లంపల్లి ఆంజనేయులు, ట్రెజరర్ శశిపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు బాణాల మధుసూదనాచారి, చాపల శ్రీనివాస్, నర్రి రమేష్, దేవయ్య, దుర్గయ్య తదితరులు ఉన్నారు.