ప్లాస్టిక్ సంచులు వద్దు.. కాగితపు సంచులు ముద్దు!
పెద్దగుమ్ములూరులో కాగితపు సంచులతో విద్యార్థుల ప్రదర్శన
ఎస్.రాయవరం, నవంబర్ 3, మేజర్ న్యూస్:
బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దగుమ్ములూరులో మంగళవారం 'సే నో టు ప్లాస్టిక్' అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా కాగితంతో సంచులు తయారుచేసి ప్రదర్శించారు. "ప్లాస్టిక్ సంచులు వద్దు - కాగితపు సంచులు ముద్దు" అంటూ నినాదాలు చేశారు. ప్రధానోపాధ్యాయిని సుధా మాధురి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వినియోగం పెరిగితే పర్యావరణం కలుషితమై మానవులు, జంతువులు ప్రమాదానికి గురవుతారని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయిని సుబ్రహ్మణ్యేశ్వరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు