BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

స్థానిక ఎన్నికల సిబ్బందికి 6 న ఓడీ సౌకర్యం కల్పించండి!

Select Suryaa Now
స్థానిక ఎన్నికల సిబ్బందికి 6 న ఓడీ సౌకర్యం కల్పించండి!

 

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు

ఎస్. రాయవరం, నవంబర్ 3, మేజర్ న్యూస్:
ఈ నెల ఐదో తేదీన జరగనున్న జడ్టీటీసి, ఎం.పీటీ.సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఓడీ సౌకర్యం కల్పించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కి మంగళవారం నాడాయన లేఖ రాశారు. లేఖలో ఆయన పేర్కొన్న అంశాలిలా వున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి 5 వ తేదీన పోలింగ్ అయిన మరుసటి రోజు 6 శుక్రవారం నాడు ఓడీ సౌకర్యం కల్పించాలని కోరారు. 5 వ తేదీన పోలింగ్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలకు చేర్చి రావడానికి అర్ధరాత్రి దాటుతుందన్నారు. తిరిగి ఉదయం ఉద్యోగాలకి హాజరు కావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతున్నదన్నారు. కావున, ఎన్నికల విధుల్లో పాల్గొని బ్యాలెట్ బాక్స్ లు అందజేసే కార్యక్రమంలో పాల్గొంటున్న వంటి పిఓలు, ఏపీఓలు మరియు సపోర్టింగ్ స్టాఫ్ నకు తేదీ 6 న ఓడీ సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నామని శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసుల నాయుడు వివరించారు.