నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి ఘన విజయం
నర్సీపట్నంలో తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ
నర్సీపట్నం పురపాలక సంఘం గెలుపు లో పద్మావతి కీలక పాత్ర
నర్సీపట్నం నవంబరు 3 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేసిన శ్రీమతి చింతకాయల పద్మావతి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 11,519 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గత కొద్ది నెలల నుండి చింతకాయల పద్మావతి ప్రతి వార్డులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించడంతో ప్రజల్లో పూర్తి విశ్వాసం ఏర్పడింది. నర్సీపట్నం పురపాలక సంఘం చింతకాయల పద్మావతి ద్వారానే అభివృద్ధి చెందిందని ప్రజలు గ్రహించి భారీ విజయాన్ని అందించారు మున్సిపల్ పీఠంపై చైర్పర్సన్ గా ప్రజలు పట్టం కట్టారు.
. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలు
గెలిచిన స్థానాలు:
తెలుగుదేశం పార్టీ (TDP): 34 స్థానాలు
జనసేన పార్టీ (JSP): 3 స్థానాలు
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP): 1 స్థానం
స్వతంత్ర అభ్యర్థులు (Independents): 2 స్థానాలు
వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు మరియు మెజారిటీ వివరాలు:
వార్డు 01: లాలం మురళీ కృష్ణ (TDP) 413 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 02: చిటేకల వెంకట లోవ మణి (TDP) 369 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 03: రుతాల లక్ష్మి (TDP) 171 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 04: సుజాత ముక్కి (TDP) 161 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 05: మామిడి చిలకమ్మ (TDP) 202 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 06: గెడ్డం రమణ (TDP) 84 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 07: కరణం అమ్మాజీ (YSRCP) 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 08: గోపి సురకాసుల (జనసేన పార్టీ) 125 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 09: సుమజ గొలుసు (TDP) 59 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 10: రావాడ లక్ష్మి (TDP) 779 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 11: పంచాడ హరినాథ్ (స్వతంత్ర) 81 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 12: కురచ రమణమ్మ (TDP) 232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 13: అద్దేపల్లి సౌజన్య (జనసేన పార్టీ) 553 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 14: బోలెం దొరబాబు (TDP) 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 15: చల్లా పోతురాజు (TDP) 178 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 16: రామలక్ష్మి గుడివాడ (TDP) 472 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 17: యాదగిరి రామదాస్ (TDP) 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 18: ఆదపురెడ్డి రామకృష్ణ (జనసేన పార్టీ) 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 19: రెడ్డి లక్ష్మి (TDP) 109 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 20: కామిరెడ్డి శ్రీనివాసరావు (TDP) 299 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 21: కొల్లి శివకుమార్ (TDP) 262 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 22: అంకంరెడ్డి కార్తికేయ (TDP) 155 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 23: గూడబండి ఆదిలక్ష్మి (TDP) 429 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 24: బేత దుర్గాదేవి (TDP) 42 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 25: గవిరెడ్డి పిడివి లక్ష్మీ గణేష్ (TDP) 346 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 26: సత్తిబాబు (TDP) ఏకగ్రీవంగా గెలుపొందారు.
వార్డు 27: రమణ (TDP) ఏకగ్రీవంగా గెలుపొందారు.
వార్డు 28: పంతగొలుసు అప్పలరాజు (TDP) 107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 29: అడిగర్ల సతీష్ (స్వతంత్ర) 236 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 30: జలుమూరి వెంకట రాజ్ కుమార్ (TDP) 189 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 31: పెదిరెడ్ల చింటు (TDP) 745 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 32: ధనిమిరెడ్డి మధుబాబు (TDP) 281 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 33: నేరెళ్ళ సీతా చంద్రిక (TDP) 324 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 34: గూడపర్తి గౌరి వరలక్ష్మి (TDP) 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 35: పైలా గోవిందరావు (TDP) 488 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 36: సుతాపల్లి సుబ్బలక్ష్మి (TDP) 498 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 37: తమలపాకుల సౌమ్య (TDP) 621 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 38: కోరుప్రోలు రాజ్యలక్ష్మి (TDP) 416 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు 39: డబ్బీరు కరుణ (TDP) 397 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వార్డు"40 గాలి రవణమ్మ టిడిపి 368 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు
ఈ విజయంతో నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు సంబరాలు చేసుకున్నారు నర్సీపట్నం మొత్తం భారీ మందు గుండు సామాగ్రితో దద్దరిల్లిపోయింది చైర్ పర్సన్ గా ఎన్నికైన కైన పద్మావతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.