మాకవరపాలెంలో టీడీపీ శ్రేణుల సంబరాలు
మాకవరపాలెం, నవంబర్ 3 ,మేజర్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యం సాధిస్తుండటంతో మాకవరపాలెంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాకవరపాలెం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అల్లు రామునాయుడు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి లభిస్తున్న ప్రజా మద్దతు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ విజయం ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని, ప్రజల విజయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రజల ఆదరణ కొనసాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఆర్.వై. పాత్రుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.