పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా రాజ్యలక్ష్మి ఘన విజయం 3475 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపు
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి 3,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొత్తం 15 టేబుళ్లకు సంబంధించిన ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో టీడీపీకి 16,728 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీకి 13,253 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 226 ఓట్లు, నోటాకు 141 ఓట్లు నమోదయ్యాయి. 639 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు.మొత్తం 30,987 ఓట్లు లెక్కించగా, టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి 3,475 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్