BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్..

Select Suryaa Now
పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి  -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్..

పకడ్బందీగా భూముల రీ సర్వే…
-కలెక్టర్ హైమావతి 
-వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్..
బెజ్జంకి/మేజర్ న్యూస్:
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేను మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి సర్వే సిబ్బందిని ఆదేశించారు.మండలంలోని వీరాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రీ సర్వే ప్రక్రియను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల సర్వే చాలా కాలం నుంచి పెద్ద సమస్యగా మారిందని గ్రహించిన ప్రభుత్వం వాటికి శాశ్వతపరిష్కారం అందించడం కోసమే ప్రభుత్వం భూ రీ సర్వేను చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి వెల్లడించారు.గ్రామ విస్తీర్ణం ఎంత?ఇప్పటివరకు ఎంత సర్వే నిర్వహించారు.అనే విషయాలపై సర్వే చేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా రోజు 35 నుంచి 40 ఎకరాలకు పైగా సర్వే చేయాలని,సర్వే ప్రక్రియను పారదర్శకంగా,కచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని సర్వే సిబ్బందిని ఆదేశించారు.సర్వే చేసిన ప్రతి అంశం రికార్డులలో నమోదు చేసి రైతులకు తెలపాలని భూ యజమానులకు సందేహాలు ఉంటే మళ్ళీ  సర్వే చేపట్టి నివృత్తి చేయాలని సిబ్బందికి సూచించారు.అలాగే రైతులు భూ రీసర్వే సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ హైమావతి కోరారు.అంతకు ముందు మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు.గదులు,పరిసరాలు,వంటగది ఇతర సౌకర్యాలను పరిశీలించారు.భోజన నాణ్యత,వంటలకు ఉపయోగిస్తున్న పదార్థాలు,పరిశుభ్రత తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం నాణ్యమైన,పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.పాఠశాల వెనకాల పిచ్చి మొక్కలు,చెత్తను గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ కు సూచించారు.పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.మెనూ ప్రకారం భోజనం అందించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబొమని సిబ్బందిని,ఉపాధ్యాయులను కలెక్టర్ హెచ్చరించారు.తహసిల్దార్ శ్రీకాంత్,భూ రీ సర్వే సిబ్బంది,జీపిఓ రజిత,రైతులు తదితరులు పాల్గొన్నారు.(సూర్య రిపోర్టర్,బెజ్జంకి)