ఎన్నికల వెబ్‌సైట్ సాంకేతిక సమస్యను పరిష్కరించి ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగించాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లొళ్ల అమరేందర్ రెడ్డి
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను సజావుగా కొనసాగించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లొళ్ల అమరేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ఎన్. శంకర్‌కు విజ్ఞప్తి చేశారు. వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాంకేతిక లోపాల వల్ల విలువైన సమయం వృథా అవుతోందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి వెబ్‌సైట్ సమస్యను పరిష్కరించాలని, నవంబర్ 6, 2026తో ముగియనున్న ఓటరు నమోదు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన పట్టభద్రులకు మరో అవకాశం కల్పించి న్యాయం చేయాలనిఆయన కోరారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.