కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే బండారు
ఆత్రేయపురం మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ లు అన్నారు మంగళవారం మండలంలోని నార్కెడిమిల్లి, వెలిచేరు గ్రామాల్లో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కూటమి ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరిగి గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కూసంపూడి రామకృష్ణంరాజు సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి సత్యనారాయణ కొప్పుల రామకృష్ణ రామకృష్ణ, తోట రజిని మద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ, గణేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.