బేతుపల్లి చెరువు ఘటనపై ఎమ్మెల్యే రాగమయి సమీక్ష
ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక )
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో మత్స్యకారులు గల్లంతైన విషాద ఘటన నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పరిస్థితులను పర్యవేక్షిస్తూ, సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ, గల్లంతైన వారి ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని బేతుపల్లి చెరువులో 10 మంది గల్లంతైన ఘటనపై జిల్లా కలెక్టర్‌ను అప్రమత్తం చేస్తూ, గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేయాలని సూచించారు. చెరువు వద్ద కొనసాగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వివరిస్తున్నారు.
అవసరమైతే అదనపు బలగలను తరలించాలని మంత్రులు ఆదేశించారు.