BREAKING
ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌లో ఘనంగా ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’ తలసాని నివాసంలో తేజస్వి యాదవ్, ఎస్పీ నేతల భేటీ మనోరంజన్ కోర్ట్ లో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం....

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు దోమ విద్యార్థిని అక్షర ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు దోమ విద్యార్థిని అక్షర ఎంపిక

దోమ, మేజర్ న్యూస్: దోమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని అక్షర వాలీబాల్ క్రీడలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-17 బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి కనబరుస్తూ క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ విజయాన్ని అందుకోవడంపై పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అక్షర తన ప్రతిభను చాటి విజయం సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఆకాంక్షిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.