BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా అరెస్ట్

Select Suryaa Now
వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా అరెస్ట్


పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఒకరు పరార్ 

రూ. 6.50 లక్షలు విలువ చేసే వ్యవసాయ పనిముట్లు, రెండు మినీ ట్రక్కులు స్వాధీనం.
 విలేకరుల సమావేశంలో సీఐ పరసయ్య వెల్లడి.

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్…కిరణ్ కుమార్ ఆరిక )
సత్తుపల్లి రూరల్ సీఐ పరసయ్య ఆధ్వర్యంలో  వ్యవసాయ యంత్రాల పనిముట్లను అపహరించే దొంగల ముఠాను వియం బంజర్ ఎస్సై షేక్ షాకీర్ తీసుకున్నారు. వారి వద్ద నుండి పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం విఎం బంజర పోలీస్ స్టేషన్లో సీఐ పరసయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం ఇన్ ఫీల్డ్ హైవే వద్ద  ఎస్సై షేక్ షాకీర్ ఇబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో వ్యవసాయ  పనిముట్లతో  అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి విచారించారు. అపహరణకు గురైన వ్యవసాయ పనిముట్లను గుర్తించి రెండు వాహనాలను, దుక్కి కి ఉపయోగించే ట్రాక్టర్ ఫుల్ వీల్స్ లను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సత్తుపల్లి మండలం చెందిన పంతంగి కేశవ్, కుంట రాఘవేంద్ర, అశ్వరావుపేట మండలానికి చెందిన మేకల గోవర్ధన్, గోపిన నవీన్, దమ్మమండలానికి చెందిన పుచ్చి ముత్తయ్య మురళి గౌతమ్, అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేట మండలానికి చెందిన మస్తాన్ నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆరుగురు నిందితులు వేంసూరు, విఎం బంజర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పొలాల్లో ఉన్న వ్యవసాయ పనిముట్లను దొంగిలించి వేరే ప్రాంతాల్లో అమ్ముకుంటారని  లను అమ్మేందుకు తిరువూరు వైపు వెళుతుండగా వారిని పట్టుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి రూ.6.50 లక్షలు విలువ కలిగిన వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు వెల్లడించారు. వేంసూరు పోలీస్ స్టేషన్లో 8, బంజర్ పోలీస్ స్టేషన్లో రెండు రైతుల నుండి  ఫిర్యాదులు నమోదు అయ్యాయని వెల్లడించారు.సిఐ పరసయ్య పర్యవేక్షణలో  చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠా గుట్టును రట్టు చేసిన ఎస్సై షేక్ షాకీర్, సహాయ సహకారాలు అందించిన వేంసూర్ ఎస్సై ప్రదీప్, ఏఎస్ఐ, పి శ్రీనివాసులు, ఏ ఎస్ ఐ టి వెంకటేశ్వర్లు (చారి) కానిస్టేబుల్లు రాజమల్లు, సురేష్, బి వెంకటేశ్వర్లు, ఎన్.శ్రీనివాసరావు, ఎస్. శ్రీనివాసరావు, బాలకృష్ణ గౌడ లను ఖమ్మం పోలీస్ కమిషనర్ అభినందించారని సీఐ వెల్లడించారు.