ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ మండల కేంద్రం ఆత్రేయపురం లో 80 మంది అయ్యప్ప స్వాములు 41 రోజులపాటు నియమనిష్ఠలతో దీక్ష పాటించి అయ్యప్ప మాలధారణ చేసి భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టారు.41 రోజుల పాటు నిత్యం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ అయ్యప్ప స్వామివారి నామస్మరణతో దీక్షను కొనసాగించారు. దీక్షా కాలం ముగియడంతో బుధవారం స్వాములంతా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఆవరణలో గురుస్వాములు ముదునూరి నాగరాజు సిన్ని స్వామి సాగిరాజు సూర్య తేజ ఆధ్వర్యంలో భక్తిపూర్వకంగా ఇరుముడులు కట్టుకున్నారు. ఆత్రేయపురం అంతా అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రమైన శబరిమలకు యాత్రగా బయలుదేరారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది