సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..!
కడ్తాల్ :రంగారెడ్డి
కడ్తాల్ మండలానికి చెందిన గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా నియమితులైనట్లు సమాచారం. గతంలో కడ్తాల్ ఉపసర్పంచ్‌గా, ఎంపీటీసీగా ప్రజలకు సేవలందించిన ఆయన, పార్టీ అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ఆపదలో అండగా నిలుస్తూ ప్రజాభిమానం సంపాదించుకున్నారు. కడ్తాల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ అందిస్తున్న సేవలను అందించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.