అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సీఎంసీ కమిషనర్ జి.సృజన
సైబరాబాద్,మేజర్ న్యూస్ : ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్ల వద్ద జరుగుతున్న హెచ్-సిటీ గ్రేడ్ సెపరేటర్ పనులతో పాటు సైబరాబాద్ పరిధిలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను సీఎంసీ కమిషనర్ జి.సృజన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెండింగ్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయం తో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.ఈ అభివృద్ధి పనులతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్, చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.