గడువులోగా...పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి : క్యానం రాజ్యలక్ష్మి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హు లైన పట్టభద్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకో వాలని వినాయక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశా రు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, మేధావులు, యువత ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందన్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన పట్ట భద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవా లని ఆమె కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమో దుకు ఫారం-18 ద్వారా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. దరఖాస్తు చేసుకునే పట్టభద్రులు అవసరమై న విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పిం చాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 2023 నాటికి కనీసం మూడు సంవత్సరాల డిగ్రీ లేదా తత్సమాన డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్సైట్ https://ceotelangana.nic.in ద్వారా ఫారం–18 సమర్పించవచ్చన్నారు.
అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసుకొని, రానున్న పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని క్యానం రాజ్యలక్ష్మి కోరారు.