BREAKING
నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జైలు

Select Suryaa Now
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జైలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (నవంబర్ 4): మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి మేడ్చల్‌లోని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి న్యాయస్థానంలో మొత్తం 21 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుధవారం పరిష్కరించబడ్డాయి. ఈ కేసుల్లో ఒకసారి కంటే ఎక్కువ సార్లు మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించడంతో పాటు, మొత్తం ₹30,100/- జరిమానా విధించింది.
కాగా, జైలు శిక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకరికి – 03 రోజుల జైలు, ఐదుగురికి – 05 రోజులు, 
మరొకరికి – 07 రోజుల జైలు, ఇంకో ఇద్దరికి – 10 రోజుల పాటు జైలు శిక్షలు విధించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని తెలిపారు.