BREAKING
పేదల నివాసాల కూల్చివేతపై రాజకీయమా..! కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన

సీఎం పర్యటనకు సైబరాబాద్ సీపీ భద్రతా ఏర్పాట్లు

Select Suryaa Now
సీఎం పర్యటనకు సైబరాబాద్ సీపీ భద్రతా ఏర్పాట్లు

 ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సున్నం చెరువు మరియు తమ్మిడికుంట చెరువుల వద్ద ఏర్పాట్లను                         పరిశీలించి, సమీక్షించిన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. ఎం. రమేష్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (నవంబర్ 4): తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిపాదిత పర్యటన నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నం చెరువు మరియు తమ్మిడికుంట చెరువులను స్వయంగా సందర్శించి పరిశీలించారు.
ఈ పర్యటనలో కూకట్‌పల్లి జోన్ డి.సి.పి శ్రీ. రితిరాజ్, ఐ.పి.ఎస్, మాదాపూర్ డివిజన్ ఎసిపి శ్రీ. సిహెచ్. శ్రీధర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, శ్రీ. పి. రమేష్ మరియు ఇతర ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, గౌరవ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ మరియు ఇతర అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూసుకోవాలని, ముఖ్యమంత్రి పర్యటన సజావుగా మరియు సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత పోలీసు సిబ్బందికి మరియు అధికారులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్  డా. ఎం. రమేష్ తగిన ఆదేశాలు జారీ చేశారు.