BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇండస్‌ టవర్స్‌ ఘనత.. లక్ష కేంద్రాలకు విస్తరణ లక్ష్యం

Select Suryaa Now
50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇండస్‌ టవర్స్‌ ఘనత.. లక్ష కేంద్రాలకు విస్తరణ లక్ష్యం

మాదాపూర్,మేజర్ న్యూస్ : టెలికం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్‌ టవర్స్‌ దేశవ్యాప్తంగా 50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ సదుపాయం కల్పించింది. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లుగా ఉంది. ఈ కేంద్రాల ద్వారా ఏటా సుమారు 4.2 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ పర్యావరణ ప్రయోజనం దాదాపు రెండు కోట్ల చెట్లు నాటడంతో సమానమని తెలిపింది.సౌర విద్యుత్‌ కేంద్రాల పనితీరు, విద్యుదుత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డిజిటల్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 50 వేల కేంద్రాలను లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌర విద్యుత్‌ వినియోగంతో డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ఇంధన వ్యయాన్ని అదుపు చేయవచ్చని సంస్థ ఎండీ, సీఈఓ ప్రచుర్‌ సాహ్‌ తెలిపారు. భారత్‌లో సాధించిన అనుభవంతో ఆఫ్రికాలోనూ ఇలాంటి సౌర విద్యుత్‌ వ్యవస్థలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.