BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సైబర్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సూచన

Select Suryaa Now
 సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సైబర్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సూచన

గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : డిజిటల్‌ వేదికలను వినియోగించేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ సూచించారు. సైబర్‌ నేరాల నివారణ, డిజిటల్‌ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నవంబరు నెలను సైబర్‌ క్రైమ్‌ అవేర్‌నెస్‌ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించకూడదన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయడం, గుర్తుతెలియని ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేయడం మానుకోవాలన్నారు. నకిలీ పెట్టుబడి పథకాలు, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, డిజిటల్‌ అరెస్టు వంటి సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గుర్తుతెలియని కస్టమర్‌ కేర్‌ నంబర్లను, అనుమానాస్పద వీడియో కాల్స్‌ను నమ్మవద్దని తెలిపారు. సామాజిక మాధ్యమ ఖాతాలకు టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పిల్లలకు సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ మోసాలు, నకిలీ ప్రొఫైల్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి....
సైబర్‌ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించడంతోపాటు నేరగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌, సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ పుష్ప తదితరులు పాల్గొన్నారు. సైబర్‌ నేరాల నివారణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడూ డిజిటల్‌ భద్రతా నియమాలు పాటిస్తూ సమాజంలో అవగాహన కల్పించాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.