గల్లంతయిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం...
మంత్రి తుమ్మల నిరంతర పర్యవేక్షణ
అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్....
(కిరణ్ కుమార్ ఆరిక)
సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి పెద్ద చెరువు వద్ద ఈరోజు రాత్రి జరిగిన సంఘటనపై మంత్రి తుమ్మల నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. బేతుపల్లి చెరువులో 8 మంది మత్స్యకారులు చిక్కుకున్న నేపథ్యంలో, వారిని రక్షించే ప్రయత్నంలో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది పడవ బోల్తా పడిన సంఘటనలో, ఆ సిబ్బంది గల్లంత అయ్యారు అని వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ సంఘటనపై మంత్రి తుమ్మల నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ని ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అక్కడే ఉండాలని మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వపరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆచూకీ తెలియని వారి ఫోన్ నెంబర్ల కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడాలని మంత్రి తుమ్మల కోరారు. సత్తుపల్లిలో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి తుమ్మల స్థానిక శాసనసభ్యులతో పాటు ఉన్నత అధికారులను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమన్వయం చేసుకుంటున్నారు.