BREAKING
దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌లో ఘనంగా ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’ తలసాని నివాసంలో తేజస్వి యాదవ్, ఎస్పీ నేతల భేటీ మనోరంజన్ కోర్ట్ లో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం.... వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా అరెస్ట్ గడువులోగా...పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి : క్యానం రాజ్యలక్ష్మి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జైలు సీఎం పర్యటనకు సైబరాబాద్ సీపీ భద్రతా ఏర్పాట్లు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సీఎంసీ కమిషనర్ జి.సృజన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి...సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గాంధీ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సైబర్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సూచన 50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇండస్‌ టవర్స్‌ ఘనత.. లక్ష కేంద్రాలకు విస్తరణ లక్ష్యం

ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం

Select Suryaa Now
ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం

 

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు రంగారెడ్డి: 

మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని,వైద్య శిబిరాలను ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సద్వినియోగంచేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆమనగల్లులైన్స్ క్లబ్, యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపు ను మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, కౌన్సిలర్లు, నాయకులు, లైన్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేప్రారంభించారు.శిబిరంలో వైద్యులు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రజలకువైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం పై అవగాహన కల్పించి, ఆరోగ్యకర మైన జీవన శైలిపై సూచనలు సలహాలు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసంస్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలనుప్రజలుసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసంఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంఅభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, వెంకటయ్య,దోలి, అనిత శ్రీనివాస్ రెడ్డి, జగన్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు అల్లాజిగౌడ్ , ఖాదర్ పాష, లైన్స్ క్లబ్ సభ్యులు, వైద్యుడు శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.