BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు

Select Suryaa Now
ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు

                     582 మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు…డీఎల్‌డీఓ కే. సురేష్ కుమార్.

                                              రిటర్నింగ్ అధికారి లక్ష్మీ ప్రత్యూష
ఆలమూరు మేజర్ న్యూస్:ఆలమూరు మండలంలోని 18 గ్రామాల్లో గురువారం నిర్వహించబోయే జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు అధికారి (డీఎల్‌డీఓ) కే. సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్వో లక్ష్మీ ప్రత్యూష, ఏఆర్వోలు ఎంపీడీఓ ఏ. రాజు, తహసిల్దార్ కే. కుశరాజుల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  77 పోలింగ్ కేంద్రాల్లో  582 మంది సిబ్బందితోఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు మరియు ఇతర ఎన్నికల సామగ్రిని ఇక్కడి నుంచే పకడ్బందీగా పంపిణీ చేయాలని సూచించారు.అదేవిధంగా ఎన్నికల అనంతరం  బ్యాలెట్ బాక్సులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాలన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని డీఎల్‌డీఓ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎంఈఓలు బి అప్పాజీ, ఎన్ రాజు,పలువురు ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులు  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.