రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు
రావులపాలెం: మేజర్ న్యూస్:పట్టణంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం కొంతమేర స్తంభించింది. కుండపోత వర్షంతో బస్టాండ్, మార్కెట్ రోడ్డు, తహసీల్దార్ కార్యాలయం రోడ్డుతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వర్షపు నీరు త్వరగా వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.