BREAKING
మెడ దగ్గర వాపు కనిపిస్తోందా? గాయిటర్ సమస్య సంకేతం కావచ్చు.. కారణాలు ఇవే! గల్లంతయిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆచూకీ కోసం... ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ! ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం డయాబెటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? రెటీనా సమస్యలపై వైద్య నిపుణుల హెచ్చరిక! సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి..! రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’ బడ్జెట్ రూ.400 కోట్లు? ఇండియన్ బాక్సాఫీస్‌పై మరో సంచలనం! చలికాలంలో చర్మం పగలకుండా మెరిసిపోవాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి! బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు!

వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి

Select Suryaa Now
వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు -  ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి

. అనపర్తి, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అధికారులకు ఆటంకంగా మారుతున్నప్పటికీ, మరోవైపు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు తమ విధులను కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఏర్పాటు చేసిన 90 పోలింగ్ కేంద్రాల వద్ద  ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం,పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి మొండి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని,  పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టమని అన్నారు. ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్ర వద్దకు పోలింగ్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా చేరుకుని ఎన్నికల నిర్వహణ పనులలో నిమగ్నమై ఉన్నారని అన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.