BREAKING
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ డబ్ల్యూటీఎం లండన్ 2026లో తెలంగాణ పర్యాటక ప్రచారం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ!

Select Suryaa Now
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రిటెన్షన్‌పై ఫుల్ క్లారిటీ!

సూర్య క్రీడా డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టెన్షన్ ప్రారంభం కానున్న తరుణంలో ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పులు మరియు రిటెన్షన్‌కు సంబంధించి అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులోనూ ప్రముఖ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వదులుకోనుందనే వార్తలు గత కొంతకాలంగా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్‌ను కూడా ట్రేడ్ ద్వారా ఇతర జట్లకు పంపనున్నారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో, తాజాగా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వర్గాలు ఈ వదంతులపై స్పందించి పూర్తి స్పష్టతనిచ్చాయి.

సూర్యకుమార్ యాదవ్‌ను ట్రేడ్ చేసే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని, ఆయనను వదులుకునే ప్రసక్తే లేదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. స్కై ట్రేడ్‌లో ఉండబోరని, దీనిపై ఎలాంటి చర్చలు ఇప్పటివరకు జరగలేదని, భవిష్యత్తులో కూడా జరగవని తేల్చిచెప్పాయి. ముంబై జట్టుకు బ్యాటింగ్ పరంగా అత్యంత కీలకంగా మారిన సూర్యకుమార్‌ను జట్టులోనే కొనసాగించాలని మేనేజ్‌మెంట్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర ఆటగాళ్ల మార్పులకు సంబంధించి కొన్ని ఫ్రాంచైజీల నుంచి చర్చలు జరుగుతున్నప్పటికీ, సూర్య విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఫ్రాంచైజీ వర్గాలు ధృవీకరించాయి.

రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి రిటెన్షన్ గడువు ఈ నెల 17తో ముగియనుండటంతో అన్ని జట్లు తమ తుది జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ జట్టుతోనే కొనసాగనుండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ముప్పుతిప్పలు పెట్టే సూర్య, ముంబై జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఈ క్లారిటీ రావడంతో సూర్యకుమార్ యాదవ్ గురించిన అన్ని రకాల ఊహాగానాలకు తెరపడినట్లయింది.