BREAKING
మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌లో ఘనంగా ‘శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026’ తలసాని నివాసంలో తేజస్వి యాదవ్, ఎస్పీ నేతల భేటీ మనోరంజన్ కోర్ట్ లో న్యాయవాదుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం.... వ్యవసాయ పనిముట్ల దొంగల ముఠా అరెస్ట్ గడువులోగా...పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి : క్యానం రాజ్యలక్ష్మి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 9 మందికి జైలు సీఎం పర్యటనకు సైబరాబాద్ సీపీ భద్రతా ఏర్పాట్లు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సీఎంసీ కమిషనర్ జి.సృజన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి...సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గాంధీ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సైబర్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సూచన 50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇండస్‌ టవర్స్‌ ఘనత.. లక్ష కేంద్రాలకు విస్తరణ లక్ష్యం పట్టభద్రుల ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి : షేక్ చాంద్ పాషా విజ్ఞప్తి

బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు

Select Suryaa Now
బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు

వరద ఉధృతిలో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు

సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో ఘటన

మత్స్యకారులను రక్షించే యత్నంలో తిరగబడ్డ ఎస్డిఆర్ఎఫ్ బోట్లు

ముమ్మరంగా గాలింపు చర్యలు

ఘటన  స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రాగమయి, కలెక్టర్ దివాకర, ఉన్నతాధికారులు.

సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్....
(కిరణ్ కుమార్ ఆరిక )
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యారు. మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పేతుపల్లి చెరువుకు భారీ వరద చేరుకుని చెరువు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోజు చిక్కుకున్న మత్స్యకారులను  రక్షించేందుకు వెళ్లి  బోట్లు తిరగబడి  పాల్గొన్న 10 మంది ఎస్ డిఆర్ ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే  సత్తుపల్లి పరిధిలోని బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా 10 మంది ఎస్ టి ఆర్ ఎఫ్ రెండు బోట్లలో చెరువులోకి వెళ్లారు. మత్స్య కారణాలను సిబ్బంది రక్షించారు.  మిగతా వారిని రక్షించే ప్రయత్నంలో 
చెరువులో ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం, బలమైన ఈదురుగాలుల కారణంగా ఆ రెండు బోట్లు తిరగబడ్డాయి. దీంతో బోట్లలో ఉన్న 10 మంది కానిస్టేబుళ్లు నీటిలో పడి గల్లంతయ్యారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు, రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో గల్లంతైన కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అరా తీశారు. గల్లంతయిన వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు కొనసాగించాలని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ కు సూచించారు.