BREAKING
నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా

పట్టభద్రుల ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి : షేక్ చాంద్ పాషా విజ్ఞప్తి

Select Suryaa Now
 పట్టభద్రుల ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి :  షేక్ చాంద్ పాషా విజ్ఞప్తి

కొండాపూర్,మేజర్ న్యూస్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషా కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగానే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 6వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. గడువు ముగియడానికి మరో మూడు రోజులే మిగిలి ఉన్నందున అర్హులైన పట్టభద్రులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని షేక్ చాంద్ పాషా పిలుపునిచ్చారు.