పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
పెరవలి మేజర్ న్యూస్ :పెరవలి మండలంలోని జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెరవలి మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందికి కాకరపర్రు హైస్కూలు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన బస్సులు వాహనాలలో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లినట్లు పెరవలి మండలం ప్రత్యేక అధికారి మరియు ఎన్నికల అధికారి ఎం సునీల్ వినయ్ మేజర్ న్యూస్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఎం సునీల్ వినయ్, తహసిల్దార్ కే నిరంజన్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి ఎన్నికల సిబ్బందికి సూచనలు అందించారు.వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు