పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి
తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 32 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించిన బట్టే వెంకట కీర్తి బుధవారం టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను బట్టి వెంకట కీర్తి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పనపాక లక్ష్మీ ఆశీస్సులను బట్టి వెంకట కీర్తి అందుకున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా మరెంతో రాణించి ఉన్నత పదవులు అలంకరించాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం వెంకట కీర్తి మీడియాతో మాట్లాడుతూ 32 వ డివిజన్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని, తనపై నమ్మకంతో విశ్వాసంతో కార్పొరేటర్ గా గెలిపించినందుకు డివిజన్లోని ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. 32 వ డివిజన్ ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు రావచ్చునని ఆమె పేర్కొన్నారు. తనను గెలిపించిన ఓటరు మహాశయులందరికీ పేరుపేరునా బట్టే వెంకట కీర్తి కృతజ్ఞతలు తెలిపారు.
H. Dwaraka, staff reporter
9705347341.