కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి.
అనపర్తి, మేజర్ న్యూస్: మండలంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది.మండలంలోని చినపొలమూరు గ్రామంలోని ఎన్టీఆర్ మూలారెడ్డి నగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంసూరి వెంకటరమణ, దంగేటి గోవర్ధనగిరి బాబు, చొల్లంగి శ్రీను భారతీయ జనతా పార్టీలో చేరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో కాషాయం తీర్థం పుచ్చుకున్నారు.ఎమ్మెల్యే నల్లమిల్లి వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నాయకులు బీజేపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో పొలమూరు గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.