కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల కౌన్సిలర్లతోపాటు చైర్మనుగా ఘన విజయం సాధించిన శ్రీరామ్ కుమార్ (చినబాబు)కు బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా బుధవారం ఆయన మట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బీసీలంతా శ్రీరామ్ చినబాబు విజయం కోసం సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించాలని తన అభ్యర్థనకు సహకరించిన బీసీలకు,ప్రజానీకానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.ఇందులో కుల సంఘాలు,ప్రజా సంఘాలు,ఓటర్లను కోరడం జరిగిందని గుర్తు చేశారు.ముఖ్యంగా మునిసిపల్ చైర్మన్ పలువురు కౌన్సిలర్లు గెలుపుకు బిసిహెచ్పిఎస్ శ్రేణులు కష్టపడటం జరిగిందని గుర్తుచేశారు.ఎన్నికలు పూర్తయిన
తాను ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని,ప్రజలతోనే తన ప్రయాణం ముందుకు సాగుతుందన్నారు.ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను పోరాటం చేస్తానన్నారు.చైర్మన్ శ్రీరామ్ చినబాబు విజయపరంపర భవిష్యత్తులోను ముందుకు కొనసాగించాలని,ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొని మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి