BREAKING
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ డబ్ల్యూటీఎం లండన్ 2026లో తెలంగాణ పర్యాటక ప్రచారం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి కూటమి విజయాలతో జనసేన బలం మరింత స్పష్టం - పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం : షేక్ చిన్నా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభివృద్ధికి సహకరించండి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి : వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ దీపావళి బాణసంచా విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నవంబర్ 5, 6 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 6న స్టాల్స్ కేటాయింపు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ‘డయాబెటిస్ అవగాహన’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీవైష్ణవులు ఐక్యంగా ఉండాలి విజయవంతంగా శ్రీరామానుజ సంక్షేమ పరిషత్ ప్రత్యేక సమావేశాలు లోతట్టు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పనుల్లో వేగం పెంచాలి.... ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు అధికారులకు సీఎంసీ కమిషనర్ జి.సృజన ఆదేశం

Select Suryaa Now
 పనుల్లో వేగం పెంచాలి.... ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు అధికారులకు సీఎంసీ  కమిషనర్ జి.సృజన ఆదేశం

మాదాపూర్,మేజర్ న్యూస్ :  నగరంలో పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అర్బన్ బయోడైవర్సిటీ (యూబీడీ) విభాగాల పనితీరుపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్, విభాగాధిపతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా విభాగాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రజా ఫిర్యాదులు, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.నగరంలోని ప్రధాన రహదారి కూడళ్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఆధునికీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిషనర్ సూచించారు. వర్షాలు కురిసినప్పుడు తరచూ నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని ఆదేశించారు.వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచుకొని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, క్షేత్రస్థాయి అధికారులు పనుల అమలుపై వ్యక్తిగత బాధ్యత వహించాలని, పౌర మౌలిక సదుపాయాలు, సేవల్లో ప్రజలకు స్పష్టమైన మార్పు కనిపించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.