అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
దుండిగల్ మేజర్ న్యూస్ : అర్హులైన పట్టభద్రులందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ లహరి గ్రీన్ పార్క్ ఓపెన్ ప్లాట్స్ అసోసియేషన్ కాలనీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో శంభీపూర్ క్రిష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు, స్థానిక పార్టీ నాయకులతో కలిసి పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం బాధ్యతగా భావించాలని అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాలనీల్లో నివసిస్తున్న అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారు ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతం చేయాలని శంభీపూర్ క్రిష్ణ సూచించారు. పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ అర్కల జీతయ్య, సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, వార్డు అధ్యక్షుడు కామేశ్వరరావు, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బాబీ, కుమ్మరి మల్లేష్, వంశీ, గోపాల్, సూర్య, కాలనీ సభ్యులు తిరుపతి, సుమన్, వెంకటేశ్వరరావు, ప్రశాంత్, కాటం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలి*
*పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ*
దుండిగల్ మేజర్ న్యూస్
అర్హులైన పట్టభద్రులందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ లహరి గ్రీన్ పార్క్ ఓపెన్ ప్లాట్స్ అసోసియేషన్ కాలనీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో శంభీపూర్ క్రిష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు, స్థానిక పార్టీ నాయకులతో కలిసి పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం బాధ్యతగా భావించాలని అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాలనీల్లో నివసిస్తున్న అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారు ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతం చేయాలని శంభీపూర్ క్రిష్ణ సూచించారు. పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ అర్కల జీతయ్య, సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, వార్డు అధ్యక్షుడు కామేశ్వరరావు, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బాబీ, కుమ్మరి మల్లేష్, వంశీ, గోపాల్, సూర్య, కాలనీ సభ్యులు తిరుపతి, సుమన్, వెంకటేశ్వరరావు, ప్రశాంత్, కాటం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.