విజ్ఞాన పోటీల్లో సత్తా చాటిన టాగోర్ కాన్వెంట్ విద్యార్థులు
చందానగర్,మేజర్ న్యూస్ : జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ (NCSC) జిల్లా స్థాయి పోటీల్లో టాగోర్ కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైంది. మొత్తం 183 ప్రాజెక్టుల్లో కేవలం ఐదు ప్రాజెక్టులు ఎంపిక కాగా, వాటిలో టాగోర్ కాన్వెంట్ ప్రాజెక్టు చోటు దక్కించుకోవడం విశేషం.విద్యార్థులు వై.వి. చరణ్ తేజ, డి. స్వరూప్ ఈ ప్రాజెక్ట్ లో పాల్గొనగా, గైడ్ టీచర్ వి. ప్రశాంతి మార్గ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ వై.వి. నాగ రమేష్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి సహకరించిన సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి మేడమ్, జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాల విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచనలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఈ విజయం పాఠశాలతో పాటు సంగారెడ్డి జిల్లాకు కూడా గర్వకారణంగా నిలిచింది.