దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త *నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా? ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా
దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో నేరేడుచర్ల మున్సిపాలిటీ చెత్త
*నేరేడుచర్ల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లేదా?
ఉన్నతాధికారుల అనుమతితోనే మున్సిపాలిటీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడుతున్నారా?
నేరేడుచర్ల మేజర్ న్యూస్
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది తెచ్చి దిర్శించర్ల గ్రామపంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డ్ లో వేస్తున్నారని దిర్శించర్ల గ్రామపంచాయతీ సిబ్బంది విలేకరులకు తెలిపారు. ఈ విషయమై నేరేడుచర్ల మున్సిపాలిటీ కమిషనర్ నాగరాజు ను వివరణ కోరగా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని మెసేజ్ పెట్టారు. మీరు ఆఫీసుకు వస్తే మాట్లాడుదాం అని సమాధానం చెప్పారు. ఎవరి ఆదేశాలు మేరకు మున్సిపాలిటీ సిబ్బంది దిర్శించర్ల డంపింగ్ యార్డ్ లో చెత్తను వేశారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ ఉండగా అక్కడి చెత్తను తెచ్చి దిర్గించర్ల డంపింగ్ యార్డ్ లో వేయాల్సిన అవసరం ఏముంది? దీనికి బాధ్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? ఇది ఉన్నతాధికారుల అనుమతితోనే జరిగిందా? మున్సిపాలిటీ సిబ్బంది ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేశారా? ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి?