BREAKING
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: సీఎంసీ కమిషనర్ జి.సృజన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి...సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గాంధీ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు సైబర్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సూచన 50 వేల టెలికం కేంద్రాలకు సౌర విద్యుత్‌ 300 మెగావాట్ల సామర్థ్యంతో ఇండస్‌ టవర్స్‌ ఘనత.. లక్ష కేంద్రాలకు విస్తరణ లక్ష్యం పట్టభద్రుల ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి : షేక్ చాంద్ పాషా విజ్ఞప్తి దీపావళికి మలబార్‌ గోల్డ్‌ ప్రత్యేక ఆఫర్లు బంగారం, రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 శాతం రాయితీ విజ్ఞాన పోటీల్లో సత్తా చాటిన టాగోర్ కాన్వెంట్ విద్యార్థులు ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు.. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు దోమ విద్యార్థిని అక్షర ఎంపిక బేతుపల్లి చెరువు ఘటనపై ఎమ్మెల్యే రాగమయి సమీక్ష పనుల్లో వేగం పెంచాలి.... ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు అధికారులకు సీఎంసీ కమిషనర్ జి.సృజన ఆదేశం విద్యుత్ ఉద్యోగులకు 2.543% డీఏ మంజూరు – ఉప ముఖ్యమంత్రికి టి జీ పి ఈ జే ఏ సి నేతల కృతజ్ఞతలు అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. వేరుశెనగలో ప్రోటీన్ ఎంత ఉంటుంది? ప్రతిరోజూ తినవచ్చా లేదా? ఆరోగ్య నిపుణుల సలహా! వన్డేల్లో న్యూజిలాండ్‌పై టీమిండియాదే పైచేయి.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో భారత్ హవా!

తుఫాన్ బీభత్సం.. కుప్పకూలిన రిటైనింగ్ వాల్! మూడు ఇళ్లకు నష్టం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
తుఫాన్ బీభత్సం.. కుప్పకూలిన రిటైనింగ్ వాల్!  మూడు ఇళ్లకు నష్టం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

కడియం, మేజర్ న్యూస్ :తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం వేమగిరి జక్కంపూడి నగర్‌లో బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి కొండచరియ వద్ద నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దిగువన ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భారీ వర్షాలకు కొండచరియ వాలు విరిగిపడటంతో శెంభాని లక్ష్మణరావు, కరణం అచ్చియ్య, కరణం సత్యవతికి చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల ప్రహరీ గోడలు, పిట్టగోడలు, భవనాల ఎలివేషన్లు ధ్వంసమై ఆస్తినష్టం సంభవించింది. అయితే ప్రమాదానికి కొద్దిసేపటి ముందే రిటైనింగ్ వాల్ దిగువన ఉన్న వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లను, ప్రమాద తీవ్రతను క్షేత్రస్థాయిలో అంచనా వేశారు.మరోవైపు స్థానిక నాయకుడు బైరవరుపు మణికంఠ ఆధ్వర్యంలో యువకులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, ప్రమాద ప్రాంతంలో సహాయక కార్యక్రమాలు నిర్వహించారు.భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.