జిల్లా సాయికి 40 మంది ఎంపిక
జఫర్ ఘడ్, మేజర్ న్యూస్, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి కలెక్టర్ కప్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించినట్లు మండల విద్యాధికారి మంగు జయప్రకాశ్ తెలిపారు.ఈ పోటీలను అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్వహించారు. చెస్, క్యారమ్స్, యోగాసనాలు, బ్యాడ్మింటన్ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మండలంలోని 10 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 160 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రతి క్రీడలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతల్లో మొత్తం 40 మంది విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.ఈ పోటీలన్నీ వ్యక్తిగత విభాగాల్లో నిర్వహించినట్లు జయప్రకాశ్ స్పష్టం చేశారు. పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వివిధ క్రీడా కమిటీల సభ్యులను, విజేత విద్యార్థులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ఆకుల సాయిలు, భూక్యా వంశీకృష్ణ, హరిత, శిరం శెట్టి శ్రీధర్, తాళ్లపల్లి మహాలక్ష్మి, రాజు, శ్రీనాథ్, రోజా కుమారి, శ్రీలత, చందా సాంబరాజు, ఉపాధ్యాయులు పిట్టల మహేందర్, నక్క కుమార్, వేణుగోపాల్, శ్రవణ్ కుమార్, మాల్యా, ఆకుల సృజన, సీఆర్పీలు పుట్టా స్వామి, మామిడాల శివకృష్ణ, బక్కం రాజ్ కుమార్, అంకేశ్వరపు హరిప్రసాద్, కుసుమ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, సురేష్, జాఫర్గడ్, జనగామ జిల్లా