BREAKING
బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆపరేషన్ త్రిశూల్ పై అవగాహన నువ్వులు, బెల్లం కలిపి తింటే శరీరానికి అందే అద్భుతమైన పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే మహిళా వర్సిటీలో జల సంరక్షణపై అవగాహన సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం -డిసెంబర్ రెండు వరకు గడువు పొడిగింపు -జనవరి 31న ప్రవేశ పరీక్ష ఇట్లు అర్జున ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్: నవంబర్ 13న భారీ చిత్రాల విడుదల ఎన్నికల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

*ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!*

Select Suryaa Now
*ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!*

 

*9వ వార్డులో బోరుబావి ఏర్పాటు.. వేసవి అవసరాలపై మున్సిపాలిటీ దృష్టి*

*చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:* ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డులో కాలనీవాసుల తాగునీటి అవసరాల కోసం బోరుబావిని ఏర్పాటు చేయించారు. బొబ్బల రాజశేఖర్‌రెడ్డి ఈ ఏర్పాటుకు సహకరించారు.వేసవిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా బోరుబావి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మోటారు, విద్యుత్‌ పరికరాలను పరిశీలించి నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.ప్రజల అవసరాలను గుర్తించి సమస్యలు తలెత్తకముందే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో తాగునీటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.